కరోనా సోకిన వారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ పవన్ కుమార్ చెబుతున్నారు. పోస్ట్ కొవిడ్‌లో చాలామందికి అల్సర్లు ఏర్పడుతాయని తెలిపారు. కరోనా అనంతరం వివిధ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. చికిత్సలో ఉపయోగించే వివిధ రకాల మందుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని అభిప్రాయవడ్డారు.
Corona: 'కరోనా నుంచి కోలుకున్నా నిర్లక్ష్యం తగదు'
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కడుపు నొప్పి తరచుగా వస్తుంటే డాక్టర్ని సంప్రదించాలని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు డాక్టర్ పవన్ కుమార్ సూచిస్తున్నారు. పోస్ట్ కొవిడ్‌లో కొందరికి అల్సర్లు ఏర్పడే అవకాశముందని అంటున్నారు. కరోనా సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేస్తున్నామని తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్నాక అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించారు. ఇతర సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. లేదంటే అవి తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాన్సర్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడం, స్యీయ నియంత్రణను పాటించడం మంచిదంటున్న సర్జికల్ గ్యాస్ట్రోలజీ వైద్యుడు డాక్టర్ పవన్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి:COVID-19 variant: కొత్తగా 'లాంబ్డా' కలకలం!