మత్తు పదార్ధాలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు అవసరమైన పరికరాలు లేకపోవడం, అవసరమైన ముడిసరుకు సంవృద్ధిగా లభించడం వల్లనే హైదరాబాద్‌ను మత్తుపదార్ధాల తయారీకి అనువైన ప్రాంతంగా ఎంచుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మత్తు మందులకు, సాధారణ ఔషధాల తయారీకి తేడా లేకపోవడం లాంటి లొసుగులను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకొని భారీ ఎత్తున మత్తుపదార్ధాలు తయారు చేస్తున్నారు.
డ్రగ్స్ తాయారీకి హైదరాబాద్ కేంద్రమైంది.. అందుకే!
ఐటీ, ఫార్మా రంగాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్... మత్తు మందుల సరఫరాకు అడ్డాగా మారింది. ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో పాశ్చాత్య పోకడలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న మత్తుమందుల దందా విచ్చలవిడి పరిస్థితులకు దారి తీస్తోంది. చాపకింద నీరులా నగరంలో డ్రగ్స్ సంస్కృతి విస్తరిస్తోందని ఫార్మా కంపెనీల్లో అనుభవం ఉన్న రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ సీనియర్ మేనేజర్ కృష్ణమోహన్ వెల్లడించారు.
సాధారణ ఔషధ తయారీ, డ్రగ్స్ తయారీ ఒకేలా ఉండమే కారణం
స్వదేశీ అవసరాలకు సరఫరా చేయడంతోపాటు విదేశాలకు కూడా సరఫరా చేస్తూ భారీ ఎత్తున సంపాదిస్తున్నారు. కొందరు జాబ్ వర్క్‌ల మాటున నిషేధిత మత్తు మందులు తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్న ఫార్మా కంపెనీల్లో అనుభవం ఉన్న కృష్ణమోహన్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.
Last Updated : Oct 7, 2020, 11:43 AM IST
TAGGED:
Manufacturing of drugs