లాక్‌డౌన్2.0: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిషేధం - lock down effect in telangana
20:48 May 11
సరిహద్దుల వద్ద ప్యాసింజర్ వాహనాల నియంత్రణ
రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్యాసింజర్ వాహనాలను నియంత్రించాలని అధికారులను ఆదేశించింది.
నిత్యావసరాల సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోపల కూడా ఉదయం 6 నుంచి 10 వరకే ప్రజా రవాణా వాహనాలకు అనుమతిస్తూ... ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది.