తెలంగాణ

telangana

ETV Bharat / city

జూన్​ నెలాఖరులో ఇంటర్​ పరీక్షలు! - intermediate exams in telangana 2021

జూన్​ నెలాఖరులో ఇంటర్​ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలించకుంటే ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల ఆధారంగా మార్కులు ఇచ్చే అంశాన్ని పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా చెప్పినట్లు సమాచారం.

telangana inter exams
తెలంగాణలో ఇంటర్​ పరీక్షలు

By

Published : May 24, 2021, 5:35 AM IST

కరోనా మహమ్మారి తీవ్రత తగ్గితే జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అవకాశం ఉంటే జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని... లేనిపక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించినున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా కేంద్రమంత్రులకు చెప్పినట్లు సమాచారం. రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేకుంటే ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల ఆధారంగా మార్కులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆ ప్రత్యామ్నాయాలను ఇంటర్‌ బోర్డు గతంలోనే.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలపై స్పష్టతకోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీచూడండి:కొలువులతో స్వాగతం పలుకుతున్న ఐటీ సంస్థలు

ABOUT THE AUTHOR

...view details