Intermediate Exams 2022 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో సిబ్బంది వారిని విద్యార్థులను క్షుణ్నంగా పరిశీలించి అరగంట ముందే లోనికి అనుమతించారు. కొన్ని చోట్ల విద్యార్థులు మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధన అమలు చేయగా.. మరికొన్ని చోట్ల అదేమి లేకుండానే లోపలికి పంపించారు.
Intermediate Exams Started Today 2022 : తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరుగుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలు కూడా రాయనందున ఇది వారికి తొలి బోర్డు పరీక్ష. 70 శాతం మాత్రమే సిలబస్, 50 శాతం వరకు ఛాయిస్ ఉండటంతో సగటు విద్యార్థి కూడా ఇంటర్ పరీక్షలను బాగానే రాయగలుగుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 24 వరకు కొనసాగనున్నప్పటికీ ఈనెల 19న ప్రధానమైన పరీక్షలు ముగుస్తాయి.