AP New Ministers Profile : వైకాపా ప్రభుత్వ తొలి మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నేడు కొత్త కేబినెట్‌ను కొలువుతీర్చనున్నారు. పాత, కొత్తల కలయికతో ఏర్పడనున్న ఈ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నేతలు, వారి నేపథ్యం, రాజకీయ ప్రస్థానమిదీ..
- అనుభవానికి పెద్దపీట
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)
నియోజకవర్గం-పుంగనూరు
వయసు: 70 సంవత్సరాలు విద్యార్హత: ఎంఏ పీహెచ్‌డీ
రాజకీయ నేపథ్యం: 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా, 1985, 1994ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1989, 1999, 2004లో పీలేరు నుంచి, 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైకాపాలో చేరి 2014, 2019ల్లో పుంగనూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, జగన్ క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు.
* పెద్దిరెడ్డి కుమారుడు పి.వి.మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా, ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
- రైల్వే ఉన్నతాధికారి నుంచి రాజకీయ నేతగా
ఆదిమూలపు సురేష్ (ఎస్సీ)
నియోజకవర్గం-యర్రగొండపాలెం
వయసు: 58 సంవత్సరాలు విద్యార్హత: ఎంటెక్, పీహెచ్‌డీ
రాజకీయ నేపథ్యం:రైల్వేలో డిప్యూటీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నుంచి వైకాపా అభ్యర్థిగా గెలిచారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి వైకాపా తరఫున విజయం సాధించి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రికి విశ్వాసపాత్రుడిగా పేరుండటంతో మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కింది.
* పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈగా పని చేస్తూనే 1989లో సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ విభాగంలో పనిచేశారు. ఆయన భార్య టి.హెచ్.విజయలక్ష్మి ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి సీబీఐ కోర్టులో వీరిద్దరిపై కేసు నడుస్తోంది.
- సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ)
నియోజకవర్గం-గంగాధరనెల్లూరు (ఎస్సీ)
వయసు: 73 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ నేపథ్యం: కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983లో కార్వేటినగరం సమితి అధ్యక్షుడిగా గెలిచారు. 2004లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి ఎన్.శివప్రసాద్‌పై గెలిచారు. 2009లో ఓడిపోయారు. తర్వాత వైకాపాలో చేరి 2014, 2019ల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీలతో విజయభేరి మోగించారు. జగన్ తొలి మంత్రివర్గంలో మొదటిసారి మంత్రిగా చోటు దక్కించుకున్నారు. తాజాగా మళ్లీ కొనసాగింపు దక్కింది.
- జడ్పీటీసీ నుంచి మంత్రి వరకు..
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (బీసీ)
నియోజకవర్గం-రామచంద్రపురం
వయసు: 60 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ నేపథ్యం:కాంగ్రెస్ పార్టీ నుంచి 2001 నుంచి 2006 వరకు రాజోలు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. తర్వాత అయిదేళ్లు తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత వైకాపాలో చేరారు. 2014లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో రామచంద్రాపురం నుంచి తెదేపా అభ్యర్థిపై గెలుపొందారు. 2020 జులైలో తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
* ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించారు.
- నలుగురు సీఎంలకు సచివుడు
బొత్స సత్యనారాయణ (బీసీ)
నియోజకవర్గం- చీపురుపల్లి
వయసు: 64 సంవత్సరాలు విద్యార్హత: బీఏ
రాజకీయ నేపథ్యం:1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. 1992 నుంచి 1999 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా పని చేశారు. 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, 1999లో అక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2004, 2009ల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో 2014లో ఓడిపోయారు. తర్వాత వైకాపాలో చేరి 2019లో మళ్లీ గెలిచారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలకశాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. జగన్ కేబినెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ పదవి దక్కింది.
* వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్.. మొత్తం నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్‌లోనూ, ఇప్పుడు వైకాపాలోనూ ఉత్తరాంధ్రలో అత్యంత కీలకనేత.
- తండ్రికి రాజకీయ వారసురాలు
తానేటి వనిత (ఎస్సీ)
నియోజకవర్గం-కొవ్వూరు
వయసు: 49 సంవత్సరాలు విద్యార్హత: ఎమ్మెస్సీ జువాలజీ
రాజకీయ నేపథ్యం:గోపాలపురం ఎమ్మెల్యేగా తెదేపా నుంచి రెండుసార్లు గెలిచిన జొన్నకూటి బాబాజీరావు కుమార్తెగా రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. తెదేపా నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో వైకాపాలో చేరారు. అప్పటి నుంచి కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓడినా 2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనితపై భారీ మెజార్టీతో గెలిచారు. వైకాపా ప్రభుత్వ తొలి మంత్రివర్గంలో మహిళాభివృద్ధి- శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
* రెండేళ్లపాటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. తర్వాత తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు.
- లెక్కల మంత్రికి మళ్లీ అవకాశం
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (ఓసీ)
నియోజకవర్గం- డోన్
వయసు: 52 సంవత్సరాలు విద్యార్హత: బీటెక్
రాజకీయ నేపథ్యం:బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తాత బీవీ శేషారెడ్డి 1955లో డోన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి రామనాథరెడ్డి గంథ్రాలయ సంస్థ ఛైర్మన్‌గా, ఒక పర్యాయం సర్పంచిగా పనిచేశారు. బుగ్గన 1995 నుంచి 2006 వరకు రెండు పర్యాయాలు సర్పంచిగా ఉన్నారు. తొలుత తెదేపాలో ఉన్న బుగ్గన వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో, తర్వాత వైకాపాలో చేరారు. 2014లో తొలిసారి డోన్ ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి జగన్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తాజాగా మరోమారు అవకాశం దక్కింది.
- ఎదురొచ్చిన పదవులు
కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ)
నియోజకవర్గం-తణుకు
వయసు: 57 సంవత్సరాలు విద్యార్హత : పదో తరగతి
రాజకీయ నేపథ్యం:2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి ద్వారకాతిరుమల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవి చేపట్టారు. 2009లో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరి దెందులూరులో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ తణుకు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
- మరోమారు అవకాశం
గుమ్మనూరు జయరాం (బీసీ)
నియోజకవర్గం- ఆలూరు
వయసు: 54 సంవత్సరాలు విద్యార్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ
రాజకీయ నేపథ్యం: 2005లో చిప్పగిరి నుంచి తెదేపా తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైకాపాలో చేరారు. 2014, 2019ల్లో ఆలూరు నుంచి రెండుసార్లు వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. జగన్ కేబినెట్‌లో కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు మరోసారి కొనసాగింపు దక్కింది.
- విపక్షాలపై దూకుడుతోనే..
జోగి రమేష్ (బీసీ)
నియోజకవర్గం- పెడన
వయసు: 52 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌గానూ, రైల్వేబోర్డు సభ్యుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో తొలిసారిగా పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మైలవరం నుంచి వైకాపా టికెట్‌పై పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెడన నుంచి మళ్లీ విజయం సాధించారు.
* ఉండవల్లిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించటం వివాదాస్పదమైంది. విపక్ష నేతలపై తీవ్రస్థాయి విమర్శలతోనే అధిష్ఠానానికి దగ్గరయ్యారు.
- చదువుల్లో స్టేట్ ర్యాంకర్
సీదిరి అప్పలరాజు (బీసీ)
నియోజకవర్గం-పలాస
వయసు: 42 సంవత్సరాలు విద్యార్హత: ఎంబీబీఎస్
రాజకీయ నేపథ్యం:కుటుంబానికి రాజకీయ నేపథ్యమేమీ లేదు. 2017లో జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. మత్స్యకార వర్గానికి చెందిన ఈయనను జగన్ 2020 జులైలో తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి మంత్రిగా కొనసాగిస్తూ సీˆఎం నిర్ణయం తీసుకున్నారు.
* ఉన్నత విద్యావంతుడు. ఏపీఆర్‌జేసీలో స్టేట్ 2వ ర్యాంకు, ఎంసెట్లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. ఎంబీబీఎస్‌లో రెండు బంగారు పతకాలు పొందారు. 26 ఏళ్ల వయసులోనే కేజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్‌గా ఉద్యోగం సంపాదించారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ఆసుపత్రి స్థాపించారు.
- 37 ఏళ్లకే మంత్రి పదవి
గుడివాడ అమర్‌నాథ్ (ఓసీ)
నియోజకవర్గం అనకాపల్లి
వయసు : 37 సంవత్సరాలు విద్యార్హత: బీటెక్
రాజకీయ నేపథ్యం:ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గుడివాడ గురునాథరావు కుమారుడిగా ఆయన నుంచి రాజకీయ వారసత్వాన్నీ అందిపుచ్చుకున్నారు. 21 ఏళ్ల వయసులోనే 2007లో తెదేపా నుంచి విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేసి తెదేపా ఎంపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి విశాఖపట్నం నగర, గ్రామీణ వైకాపా జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2019లో అనకాపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపై గెలిచారు. ఇటీవల వైకాపా జిల్లా అధ్యక్షునిగానూ బాధ్యతలు స్వీకరించారు.
- కార్పొరేటర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు..
షేక్ బేపారి అంజాద్ బాషా (మైనార్టీ)
నియోజకవర్గం-కడప