ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శక్రవారం నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. ఆషాడ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శక్రవారం ఉదయం ఆరు గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 5వ తేదీ ఉదయం పుర్ణాహుతితో ముగుస్తాయి. శాకంబరీ ఉత్సవాలకు వచ్చే భక్తులు ఆన్‌లైన్ స్లాట్ ప్రకారం టిక్కెట్ బుక్ చేసుకోవాలని ఆలయ పాలక మండలి పేర్కొంది.
5వ తేదీన తెలంగాణ నుంచి బోనాలు
కరోనా దృష్ట్యా శాకంబరీ ఉత్సవాల తొలి రెండు రోజులు అంతరాలయంలో మాత్రమే శాకంబరీ అలంకారం ఉంటుంది. మూడో రోజు మహా మండపంతో పాటు ఇతర ప్రాంగణాలను కూరగాయలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదం భక్తులకు అందజేస్తారు. శాకంబరీ ఉత్సవాల కోసం ఇప్పటికే కూరగాయలతో అలంకరణ ప్రారంభించారు. ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోనాల కమిటీ సభ్యులు ఈనెల ఐదో తేదీన అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
ఇదీ చదవండి :దిగొచ్చిన బంగారం ధర- 10 గ్రాములు ఎంతంటే?