తెలంగాణ

telangana

ETV Bharat / city

గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత - lockdown in guntur

తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి రూ. 5లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు.

alchohal
గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Apr 5, 2020, 4:00 PM IST

గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందాపురంలో రూ.5లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు పాల క్యాన్లలో మద్యాన్ని తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు మార్గమధ్యలో తనిఖీ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారయ్యారు. తెలంగాణలో ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details