తెలంగాణ

telangana

ETV Bharat / city

శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం - ఐఐటీ హైదరాబాద్‌

శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనేలా ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు ముందడుగు వేశారు. నోటి మాత్రల రూపంలో తీసుకున్న ఔషధం కొద్దికొద్దిగా శరీరంలోకి విడుదలయ్యే విధానాన్ని కనిపెట్టారు. దీనివల్ల ఔషధాన్ని పూర్తిస్థాయిలో సమర్థంగా వినియోగించుకునే అవకాశంతో బాధితులకు ఉపశమనం లభిస్తుంది.

శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం

By

Published : Aug 23, 2019, 6:50 PM IST

శిలీంధ్రాల వ్యాధి బాధితులకు ఉపశమనం

ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల శోధన ఫలితాలు ‘నానో స్ట్రక్చర్స్‌, నానో ఆబ్జెక్ట్స్‌’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లతోపాటు బ్లాక్ ఫీవర్ చికిత్స కోసం ఆంఫోటెరిసిన్‌ బీ ఔషధాన్ని వాడుతుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు శరీరానికి అందే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటే అది సమర్థంగా ఇన్ఫెక్షన్లను తగ్గించలేకపోతున్న పరిస్థితి.

నోటి మాత్రల రూపంలో తీసుకునే ఔషధం నియంత్రిత పద్ధతిలో కొద్ది కొద్దిగా విడుదలయ్యేలా ఐఐటీ హైదరాబాద్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్‌ సప్తర్షి మజుందార్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌శర్మ పరిశోధన సాగించారు. డాక్టర్‌ అనిందితా లాహా, పరిశోధక విద్యార్థిని మృణాళిని ఇందులో భాగస్వాములయ్యారు. ఆహార, ఔషధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న జెలటిన్‌ పాలిమర్‌ను వీరు ఎంచుకున్నారు. అమెరికాకు చెందిన ఎఫ్​డీఏ ఈ పాలిమర్‌ను ఆమోదించింది. పాలిమర్‌లో ఆంఫోటెరిసిన్‌ బీ ఔషధాన్ని ఉంచి ఎలక్ట్రోస్పిన్నింగ్‌ విధానం ద్వారా నానో ఫైబర్స్‌ను అభివృద్ధి చేశారు. వీటిని క్రాస్‌లింక్‌ చేసిన అనంతరం మాత్రలుగా తయారు చేశారు.

ఇదీ చూడండి: ఓ వైపు యురేనియం... మరోవైపు క్వార్ట్​జ్​...

ABOUT THE AUTHOR

...view details