ఈ నెల ప్రారంభం నుంచి రూ.40.71 రాయితీని మాత్రమే కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు అందజేస్తోంది. తాజా పెంపుదలతో ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్(14.2 కిలోలు) ధర రూ.846.50కు చేరింది. గడిచిన ఏడాది 702.00 సిలిండర్ ధర ఉన్నపుడు రూ.40.71 పైసలు రాయితీ ఇచ్చింది. అప్పటినుంచి సిలిండర్ ధర పెరుగుతున్నప్పటికీ సబ్సిడీ మాత్రం కేంద్రం యథాతథంగా ఉంచింది. గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ ఇచ్చే విషయంలో కేంద్రం నిర్దిష్ట విధానాన్ని ప్రకటించిన దాఖలాలేమీ లేవు.
సిలిండర్ ధర పెరిగినా.. రాయితీ మాత్రం అంతే..
గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధర గణనీయంగా పెరిగినప్పటికీ రాయితీ మాత్రం పెరగలేదు. ప్రతివారం ధరల పెంపులో భాగంగా ఈ నెలలో ఇప్పటివరకు మూడు దఫాలుగా సిలిండర్‌పై రూ.100 వడ్డన విధించింది.
సిలిండర్ ధర పెరిగినా.. రాయితీ మాత్రం అంతే
ఇప్పటివరకు వినియోగదారులకు 2017 ప్రాంతంలో 535 రూపాయలు అత్యధికంగా సబ్సిడీ ఇచ్చినట్లు గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. అప్పుడు సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.వెయ్యిగా ఉండేది. తర్వాత నుంచి సిలిండర్ ధరతో పాటు.. సబ్సిడీ కూడా తగ్గుతూ వచ్చిందని గ్యాస్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌కుమార్ చెప్పారు. మరోవైపు వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గుతూ వస్తోంది.
సంబంధిత కథనం:వంట గ్యాస్‌పై మరో రూ.25 బాదుడు