IMA Passing Out Parade 2021: హైదరాబాద్ ఆర్టీ సెంటర్‌కు చెందిన.. వైశాఖ్ చంద్రన్ డెహ్రాదూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ ముగించుకున్నారు. లెఫ్టినెంట్ హోదాలో సైనికాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. వైశాఖ్ చంద్రన్‌ను లెఫ్టినెంట్‌గా చూసి ఆయన కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. తమ కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. సుశిక్షితునిగా దేశసేవలో భాగస్వామి కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సైన్యంలో చేరటం.. కుటుంబ సంప్రదాయమేంటని ఆలోచిస్తున్నారా.. అయితే వైశాఖ్ చంద్రన్ కుటుంబ నేపథ్యాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
ఆ కుటుంబమంతా సైనికులే..
వైశాఖ్ చంద్రన్ కుటుంబం ఓ సైనికుల కర్మాగారం. ఆయన తాతలిద్దరూ సైనికులుగా దేశానికి సేవ చేశారు. తండ్రి సునీల్ చంద్రన్.. ప్రస్తుతం ఆర్టిలరీ డివిజన్లో కర్నల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీళ్లే కాకుండా.. వైశాఖ్ సోదరి భర్త నేవీలో అధికారిగా సేవలందిస్తున్నారు. తాను పుట్టటమే ఓ సైనిక కుటుంబంలో పుట్టటం.. చిన్నప్పటి నుంచి వాళ్ల వీరత్వాలు చూస్తూ పెరగటం.. దేశానికి వాళ్లు చేస్తున్న సేవలను నరనరాన జీర్ణించుకున్న వైశాఖ్.. తాను కూడా సైనికుడిగా మారాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నారు. వాటిని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.
తాతల నుంచి దేశసేవలోనే..
2020 సెప్టెంబర్‌లో వైశాఖ్ చంద్రన్ ఐఎంఏలో చేరారు. డెహ్రాదూన్‌లోని మిలిటరీ అకాడమీలో.. కఠోర శిక్షణ తీసుకుని నేడు సుశిక్షితునిగా బయటికి వచ్చాడు. లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ అధికారిగా.. తన తాతలు, తండ్రి, బాటలోనే దేశానికి తనవంతు సేవ చేసేందుకు బాధ్యతలు స్వీకరించారు. వైశాక్ చంద్రన్ ఆర్మీలోకి రావటంతో.. వాళ్ల కుటుంబం మొత్తం సైనికులతో నిండిపోయినట్టైంది. సైన్యంలో వైశాఖ్ చేరటం.. శిక్షణ ముగించుకుని బాధ్యతలు స్వీకరించటాన్ని చూసి అందరూ.. ఇది వాళ్ల కుటుంబ సంప్రదాయంగా అభివర్ణిస్తున్నారు.
వైశాఖ్ తల్లి భావోద్వేగం..