తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2021, 9:00 AM IST

ETV Bharat / city

Traffic Rules News: వాహనం నడుపుతూ ఫోన్​లో మాట్లాడుతున్నారా.. ఇక మీరు జైలుకే!

వాహనం నడుపుతూ ఫోన్​లో మాట్లాడుతున్నారా..? మీ పని అంతే ఇక.. జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు ట్రాఫిక్​ పోలీసులు(Traffic Rules News). చరవాణిలో మాట్లాడుతూ వెళ్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. కోర్టు వీరికి రూ.5 వేలు జరిమానాతో పాటు ఏడాదిపాటు జైలుశిక్ష విధించనుంది.

Traffic Rules News
Traffic Rules News: వాహనం నడుపుతూ ఫోన్​లో మాట్లాడుతున్నారా.. ఇక మీరు జైలుకే!

మీరు వాహనం నడుపుతూ చరవాణిలో మాట్లాడుతున్నారా.. ఇకపై అలా కుదరదని ట్రాఫిక్‌ పోలీసులు (Traffic police warnings) హెచ్చరిస్తున్నారు. జరిమానాతో పాటు భవిష్యత్తులో జైలుకు వెళ్తారని (fine and prison) స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రమాదాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది. దీంతో చరవాణి డ్రైవింగ్‌పై నిఘా (focus on driving) పెట్టారు. సెప్టెంబరులో 3,890 కేసులు నమోదు చేశారు.

ప్రమాదం వెన్నంటే..

కొద్దిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు బైకులు, కార్లు, ఇతర వాహనదారులపై నిఘా పెట్టారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లే వారి డ్రైవింగ్‌ను, ఫోన్‌లో మాట్లాడకుండా వెళ్తున్నవారి డ్రైవింగ్‌ను పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న కొన్ని అంశాలను గమనించారు.

  • నగరంలోని 85 ప్రధాన కూడళ్ల వద్ద కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పరిశీలించారు. ద్విచక్రవాహనదారుల్లో 70 శాతం మంది ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు.
  • ఈ ఉల్లంఘనులు ఎక్కువ ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, కోఠి, మలక్‌పేట, జూబ్లీహిల్స్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఠాణాల పరిధుల్లోనే కనిపిస్తున్నారని గుర్తించారు.
  • వాహనం నడిపేప్పుడు ఫోన్‌ మోగగానే..బైక్‌, స్కూటీలపై వెళ్తున్నవారు వెనక, ముందూ ఆలోచించకుండా ఎత్తుతున్నారు. వాహనవేగం తగ్గి, వెనక వచ్చే వారు ఢీకొంటున్నారు. మరికొందరు ఒకచేత్తోనే వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు సరిగా వినిపించకపోవడంతో ఫోన్‌ దగ్గరగా పట్టుకొనే ప్రయత్నంలో యాక్సిలేటర్‌ గట్టిగా లాగుతున్నారు. ముందు వాహనాలను ఢీకొంటున్నారు.

ఏడాది జైలు.. రూ.5 వేల జరిమానా

ఇకపై కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టాన్ని ఉల్లంఘనులపై ప్రయోగించాలనుకుంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. చరవాణిలో మాట్లాడుతూ వెళ్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. కోర్టు వీరికి రూ.5 వేలు జరిమానాతో పాటు ఏడాదిపాటు జైలుశిక్ష విధించనుంది. వాహనాలను నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్లను కేవలం గమ్యస్థానాలకు దారి చూపేందుకు మాత్రమే వినియోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించడంతో ట్రాఫిక్‌ పోలీసులు జైలు, జరిమానా అంశంపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details