తెలంగాణ

telangana

ETV Bharat / city

జేఈఈ‌లో నగర విద్యార్థుల సత్తా.. అత్యుత్తమ ర్యాంకులు కైవశం - జేఈఈలో అత్యుత్తమ ర్యాంకులు కైవశం చేసుకున్న విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో భాగ్యనగర విద్యార్థులు పలువురు సత్తా చాటారు. అఖిల భారత విభాగంలో ఉత్తమంగా మెరిశారు. వందలోపు ర్యాంకులు సాధించి దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి అర్హత సాధించారు.

jee advanced results 2020
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నగర విద్యార్థుల సత్తా

By

Published : Oct 6, 2020, 7:57 AM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో హైదరాబాద్​ విద్యార్థులు అత్యత్తమ ర్యాంకులు కైవశం చేసుకున్నారు. సనత్‌నగర్‌కు చెందిన మాకం అనీష్‌ అఖిలభారత స్థాయి 27వ ర్యాంకు సాధించాడు. గత నెలలో నిర్వహించిన ఐఐటీ మెయిన్స్‌లో ఇతను 84వ ర్యాంకు సాధించగా.. అడ్వాన్స్‌డ్‌లో మరింత మెరుగైన ర్యాంకుతో నిలిచాడు. ‘‘ఐఐటీ-ముంబయిలో చేరి కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుంది. కృత్రిమ మేధలో మంచి పట్టు సాధించి భవిష్యత్తులో ఆ రంగంలో స్థిరపడాలనుకుంటున్నా’’ అని తెలిపాడు.

* మాసబ్‌ట్యాంకులోని ఓ అకాడమీలో చదువుతున్న అబ్దుల్లా మహమ్మద్‌ ఓబీసీ కేటగిరీలో 92వ ర్యాంకు సాధించాడు. అత్తాపూర్‌ తేజస్వీనినగర్‌కు చెందిన సాయికార్తీక్‌ జేఈఈ మెయిన్స్‌లో అఖిలభారత స్థాయిలో 366 ర్యాంకు సాధించారు.సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనేది తన లక్ష్యమని తెలిపాడు.

గురుకుల విద్యార్థుల ప్రతిభ

గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర ఐఐటీ అకాడమీలో 65 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయగా 22 మంది మంచి ర్యాంకులు సాధించారు. ఎం.మహేష్‌ 402 ర్యాంకుతో అకాడమీలో టాపర్‌గా నిలిచాడు. ఎం.అనిల్‌ చౌహాన్‌, రవి ప్రకాశ్‌, జె.రాకేశ్‌కుమార్‌, కె.విజయలక్ష్మి, కె.హరివిష్ణు, దేవేందర్‌ బాబు ప్రతిభ చాటినవారిలో ఉన్నారు.

ఇవీ చూడండి:నేడు ఎంసెట్​ ఫలితాలు.. 9 నుంచి కౌన్సెలింగ్​..

ABOUT THE AUTHOR

...view details