తెలంగాణ

telangana

ETV Bharat / city

కోకా కోలా లాటరీ పేరుతో ఈమెయిల్​... రూ.43 లక్షల టోకరా - cheating with the name of lottery in hyderabad

కోట్లల్లో డబ్బు వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు పంపే మెయిల్స్​, మెసేజ్​లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు అంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా కాచిగూడకు చెందిన ఓ విద్యార్థి సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని రూ.43 లక్షలు పోగొట్టుకున్నాడు.

కోకా కోలా పేరుతో ఈమెయిల్​... రూ.43 లక్షల టోకరా

By

Published : Oct 10, 2019, 9:16 AM IST

నిజామాబాద్​ జిల్లా కమ్మర్​పల్లికి చెందిన చెందిన గంగారెడ్డి హైదరాబాద్​ కాచిగూడలో హోటల్​ మేనేజ్​మెంట్​ కోర్సు చేస్తున్నాడు. కోకా కోలా కంపెనీ నిర్వహించిన లాటరీలో మూడు కోట్ల బహుమతి వచ్చిందని అతనికి మెయిల్​ వచ్చింది. ఆ బహుమతి పొందాలంటే మీ వివరాలు పంపాలని ఆ మెయిల్​లో పేర్కొనగా... తన సమాచారాన్ని మెసేజ్​ పంపాడు. రెండ్రోజుల తర్వాత నికోలస్​ అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్​ చేసి రూ.23 వేలు జమ చేస్తే మూడు కోట్ల చెక్కు పంపిస్తాననగానే ఆ విద్యార్థి డబ్బు పంపాడు.

జీఎస్టీ, టాక్స్​ అంటూ మాయమాటలు చెప్పి గంగారెడ్డి నుంచి ఐదు నెలల్లో విడతల వారీగా రూ.43.22 లక్షలు గుంజారు. తండ్రికి సర్దిచెప్పి నాలుగెకరాల వ్యవసాయ భూమి తాకట్టు పెట్టి మరీ డబ్బు కట్టాడు. కొన్నిరోజుల తర్వాత తండ్రికి అనుమానం వచ్చి ముంబయికి వెళ్లి చెక్కు తీసుకుందామని అతని ఫోన్​ చేయమని గంగారెడ్డికి చెప్పాడు. ఫోన్​ స్విఛాఫ్​ రావడంతో మోసపోయామని గ్రహించి సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్​ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా.. ప్రజలు ఇంకా మోసపోతున్నారని,.. డబ్బు వచ్చిందని, లాటరీ గెలిచారని మెసేజ్​లు, ఈమెయిల్​ వస్తే నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details