తెలంగాణలో శుక్రవారం రోజున పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి తెలిపారు. ఏప్రిల్ 17, 18న రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో నేడు పలుచోట్ల వర్షాలు
రాష్ట్రంలో శుక్రవారం రోజున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 17, 18న పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపింది.
గురువారం రోజున విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం, కేరళ తీరం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఇంటీరయర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి, గాలి విచ్ఛిన్నతి శుక్రవారం రోజున బలహీనపడిందని ప్రకటించారు. శుక్రవారం రోజున ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపంతో నష్టం మిగిల్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చదవండి :ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ