తెలంగాణ

telangana

ETV Bharat / city

'శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' - hyderabad news

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 1న జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల కోసం తీసుకుంటున్న చర్యలపై సీపీ అంజనీ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

hyderabad cp anjani kumar spoke on ghmc elections
'శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం'

By

Published : Nov 21, 2020, 7:07 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఉస్మానియా వర్సిటీలో డీఆర్సీని పరిశీలించిన సీపీ... ఎస్​ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు లెక్క చూపాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్‌ హెచ్చరించారు.

'శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం'

ఇవీ చూడండి: తెరాసపై ఎన్నికల కమిషనర్​కు ఉత్తమ్​కుమార్​ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details