Bansilal Pate Ancient Step Well Restoration Works: హైదరాబాద్ బన్సీలాల్ పేట్ పురాతనమైన మెట్ల బావి పునరుద్దరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ అద్భుత కట్టడాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా జీహెచ్ఎంసీ పనులు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 100 కు పైగానే మెట్ల బావులు ఉంటాయని అధికారులు తెలిపారు. వీటిలో సుమారు 20 బావుల వరకు అక్రమాలకు గురైయ్యాయని, మిగిలినవి శిథిలావస్థలో చేరుకున్నాయని పేర్కొన్నారు.
కొన్ని బావుల స్థలాల్లో నిర్మాణాలు వెలిశాయి.. మరికొన్ని స్థలాల్లో చెత్తతో బావులు నిండి ఉన్నాయని అన్నారు. దీంతో బావులు రూపు కోల్పోయి చెత్తకు ఆవాసాలుగా మారాయి. వీటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద బన్సీలాల్ పేట్ పురాతనమైన మెట్ల బావి 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు, 53 అడుగుల లోతు కలిగి ఉంది.