పిల్లల అభిరుచులను ప్రోత్సహించాలి: శైలజా కిరణ్ హైదరాబాద్లోని ఓ హోటల్లో 35వ నేషనల్ ఐఎస్ఓపీఏఆర్బీ 2019 సమావేశం నిర్వహించారు. మహిళ ఆరోగ్యం-ఆధునిక జీవన శైలి అనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, సినీ నటి నమ్రతతో పాటు పలువురు వైద్యులు హాజరయ్యారు. పిల్లలతో స్నేహంగా
పిల్లలు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే వారి శక్తి సామర్థ్యాలు, ఆసక్తి, అభిరుచులను బట్టి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శైలజా కిరణ్ అన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడలతో పాటు, యోగాకు 45 నిమిషాల సమయం తప్పనిసరి చేస్తే పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అభిప్రాయపడ్డారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలని పేర్కొన్నారు.
విధానాన్ని బట్టి
ఆధునిక జీవిన శైలితో ఎలాంటి నష్టాలు లేవని... అవి ఉపయోగించే విధానాన్ని బట్టే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ వైద్యులు స్వప్న అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి:'ఇందిరను కీర్తించారు.. మోదీని ప్రశంసించరా?'