తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. గడిచిన పది రోజులుగా ఈ ప్రక్రియ నిలిపివేసిన తితిదే.. మళ్లీ ప్రారంభించింది. టోకెన్లు సొంతం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. భక్తుల రద్దీ దృష్ట్యా ముందుగానే ప్రక్రియ ప్రారంభించారు.
శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులు - తిరుపతి సర్వ దర్శన టోకెన్ల సమాచారం
తిరుపతిలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. గత పది రోజులుగా ఈ ప్రక్రియ నిలిచిపోయి తిరిగి ప్రారంభమైన తరుణంలో.. భక్తులు భారీగా తరలివచ్చారు.
ttd
తిరుపతిలోని రెండు చోట్ల మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. ఫలితంగా.. విష్ణు నివాసంలో భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడారు.
ఇదీ చదవండి:సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే