రాష్ట్రం నుంచి కుంభమేళాలో పాల్గొన్న వారికి హోంక్వారంటైన్
20:45 April 23
రాష్ట్రం నుంచి కుంభమేళాలో పాల్గొన్న వారికి హోంక్వారంటైన్
ఈనెల 1 నుంచి 17 వరకు రాష్ట్రం నుంచి కుంభమేళాకు హాజరైన వాళ్లు తప్పక క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకూ దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించారు.
జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ.. తప్పక కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఇవీచూడండి:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి ఈటల