తెలంగాణ ఏర్పాటయ్యాక వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. వామపక్ష తీవ్రవాదంపై తెలుగు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను కేంద్ర హోంమంత్రి ప్రశంసించారని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాదం అణచివేతకు సాయం పెంచాలని కోరినట్లు తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అదనపు కేంద్ర బలగాలను మోహరించాలని కోరినట్లు తెలిపారు. రహదారి కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బ్యాంకులు, తపాలా సేవల విస్తృతిని పెంచాలని సూచించామన్నారు.
'వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో బలగాలు పెంచాలి'
ఇవాళ దిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల హోంమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా భేటీ అయ్యారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అదనపు కేంద్ర బలగాలు మోహరించాలని కోరామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
'వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో బలగాలు పెంచాలని కోరాం'