ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కిలారి రాజేశ్, మరికొందరిపై పెట్టిన కేసులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. భూములు అమ్మిన వారెవ్వరూ ఫిర్యాదులు చేయలేదని కిలారి రాజేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇన్‌సైడర్ కేసులపై ఐపీసీ సెక్షన్లు వర్తించవు : ఏపీ హైకోర్టు - amaravathi capital lands issue news
ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెట్టిన కేసులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై ఐపీసీ సెక్షన్లు వర్తించవని స్పష్టం చేసింది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వీరిపై పెట్టిన కేసులు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
TAGGED:
Kilari Rajesh