వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు స్టే పొడిగింపు - మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు
15:36 December 08
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు స్టే పొడిగింపు
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఇచ్చిన స్టేను ఈనెల 10 వరకు హైకోర్టు మరోసారి పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జోవోలపై న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని తెలిపారు. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని... పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని సూచించింది. సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాల్సిందేనన్న హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.