తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకుండా నేరుగా పిల్​ దాఖలు చేస్తారా?' - ప్రజా ప్రయోజన వ్యాజ్యం

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కేర్, గ్లోబల్ ఆస్పత్రులకు జరిమానా విధించి... ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ జరపాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకుండా... రకరకాల అభ్యర్థనలతో కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది.

high court serious on enquiry on private hospitals pil
high court serious on enquiry on private hospitals pil

By

Published : Apr 1, 2021, 10:38 PM IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకుండా నేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కేర్, గ్లోబల్ ఆస్పత్రులకు జరిమానా విధించాలని, ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ జరపాలని, ఫిర్యాదుల కోసం మాజీ జడ్జిలతో ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ జర్నలిస్టు నరేందర్ వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకుండా... రకరకాల అభ్యర్థనలతో కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించిన హైకోర్టు.. పిల్​ను కొట్టివేసింది.

ఇదీ చూడండి: గెలుపే లక్ష్యంగా జోరందుకున్న పార్టీల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details