నీలోఫర్ ఆసుపత్రి భోజనం కాంట్రాక్టర్ సురేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సురేష్ ఆక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని కోరుతూ డాక్టర్ భగవంతరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సురేష్‌పై విచారణ జరిపిన కమిటీ నివేదికను నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ హైకోర్టుకు సమర్పించారు.
నీలోఫర్ భోజనం కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోండి: హైకోర్టు - నీలోఫర్ ఆసుపత్రి భోజన కాంట్రాక్టర్‌పై చర్యలకు హైకోర్టు ఆదేశాలు
నిలోఫర్ ఆసుపత్రి భోజనం కాంట్రాక్టర్‌పై సీఐడీ విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌పై హైకోర్టు మరోసారి విచారించింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
కాంట్రాక్టర్ తప్పుడు బిల్లులతో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు నివేదికలో ప్రస్తావించారు. కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. చర్యలు తీసుకోకుండా గాంధీ, ఛాతీ ఆస్పత్రి కాంట్రాక్టులు కూడా ఆయనకే అప్పగించడం... అవినీతిని ప్రోత్సహించడం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది. సురేష్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన హైకోర్టు... ఏం చర్యలు తీసుకున్నారో సెప్టెంబరు 16లోగా నివేదిక సమర్ఫించాలని ఆదేశించింది.
TAGGED:
high court orders