రాష్ట్రంలో గతేడాది భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకున్నారా లేదా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
విచారణ చేపట్టింది..
రాష్ట్రంలో గతేడాది భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకున్నారా లేదా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
విచారణ చేపట్టింది..
గత సెప్టెంబరు, అక్టోబరులో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ, పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటరు దాఖలుకు గడువు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. అంగీకరించిన ధర్మాసనం నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ను ఆదేశించింది.