తెలంగాణ

telangana

ETV Bharat / city

bigboss: బిగ్​బాస్​ రియాల్టీ షోపై హైకోర్టు సీరియస్.. - ఏపీ తాజా వార్తలు

High Court on Bigg Boss reality show: బిగ్​బాస్​ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.

big boss reality show
బిగ్​బాస్​ రియాల్టీ షో

By

Published : Sep 30, 2022, 4:27 PM IST

High Court on Bigg Boss reality show: నేటి యువతలో బిగ్​బాస్​ షో పట్ల ఉన్న అభిరుచి ఇంకా ఏ షోపై ఉండదేమో.. ఎందుకంటే అందులోని చూపించే సీన్​లు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయి అంటే అందులో చూపించే అశ్లీలతనే ప్రధాన కారణంగా చెప్పుతున్నారు విశ్లేషకులు. ఆ షోకు వచ్చే టీఆర్​పీ రేటింగ్​లు కూడా అంతగానే ఉంటున్నాయి. ఈ షోను చూసి యువత పక్కదారి పడుతోందని ఎందరో అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది.

దీనికి అనుగుణంగా బిగ్​బాస్ షోలో అశ్లీలత పెరిగిందని సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్​పై హైకోర్టులో విచారణ జరిగింది. బిగ్​బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్​లైన్స్ పాటించలేదని పిటిషన్ తరఫు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది... ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

అశ్లీలతపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కావాలని కోర్టును కోరారు. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది. ఇప్పుడు జరుగుతున్న బిగ్​బాస్​ రియాల్టీ షోకు హోస్ట్​గా ప్రముఖ నటుడు నాగార్జున వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details