గ్రేటర్ పోరు: కుత్బుల్లాపూర్‌లో ఉద్రిక్తత.. ఎస్సైకి గాయాలు - hyderabad news
14:24 November 21
కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కుత్బుల్లాపూర్ 125వ డివిజన్ గాజులరామారంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం సోదరుడు కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామపత్రాల పరిశీలన సమయంలో ఆయన నామినేషన్‌ను అధికారులు తొలగించారు. దీంతో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
ఈ క్రమంలో ఎస్సై మన్మధకు గాయాలయ్యాయి. కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలోకి ఎక్కిస్తుండగా పద్మ అనే మహిళ కింద పడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. రిటర్నింగ్ అధికారి అన్యాయంగా శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్‌ను తిరస్కరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవ్: మంత్రి తలసాని