తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడ అగ్నిప్రమాదంపై కథానాయకుడు రామ్ స్పందన

విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై కథానాయకుడు రామ్ స్పందించారు. సీఎం జగన్​ను తప్పుగా చూపించేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్లుందని రామ్ అన్నారు. అందరినీ ఫూల్స్​ని చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారన్నారు. ఈ మేరకు పలు ట్వీట్స్ చేశారు.

ram
విజయవాడ అగ్నిప్రమాదంపై కథానాయకుడు రామ్ స్పందన

By

Published : Aug 15, 2020, 5:13 PM IST

విజయవాడలో రమేశ్​ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై కథానాయకుడు రామ్ స్పందించారు. హోటల్ స్వర్ణ ప్యాలెస్​ని.. రమేశ్​ ఆస్పత్రి యాజమాన్యం కొవిడ్ సెంటర్​గా మార్చక ముందు ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని రామ్ అన్నారు. అప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లని ట్విట్టర్​లో ప్రశ్నించారు.

ఏపీ సీఎం జగన్​ను తప్పుగా చూపించేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్లుందని రామ్ అన్నారు. ముఖ్యమంత్రి కింద పనిచేసే కొంత మంది సీఎంకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఆయన రెప్యుటేషన్, సీఎం మీద తాము పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోందంటూ ట్విట్టర్​లో వ్యాఖ్యానించారు. వారి మీద ఓ కన్నేసి ఉంచాలని సీఎంకు సూచించారు.

అందరినీ ఫూల్స్​ని చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారని అన్నారు. మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్​గా బిల్లింగ్ చేసిన ఫీజు వివరాలను ట్విట్టర్​లో ప్రదర్శించారు.

విజయవాడ అగ్నిప్రమాదంపై కథానాయకుడు రామ్ స్పందన

ఇవీచూడండి:స్వర్ణ ప్యాలెస్​లో అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్​​: సీపీ శ్రీనివాసులు

ABOUT THE AUTHOR

...view details