Rainfall Warning: వాతావరణ శాఖ హెచ్చరిక.. రాష్ట్రానికి అత్యంత భారీ వర్షసూచన - తెలంగాణలో వర్షాలు
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
Rainfall Warning
By
Published : Sep 7, 2021, 4:48 AM IST
|
Updated : Sep 7, 2021, 6:05 AM IST
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో... లోతట్టు కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. సహాయం కోసం నం. 040- 2955 5500 సంప్రదించాలని తెలిపారు.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సోమవారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓల్డ్ కొత్తగూడెం 19.9సెంటీ, చుంచనపల్లి మండలం గరిమెల్లపాడులో 18.8, పాల్వంచ మండలం సీతారాంపట్నం 18.8, వరంగల్ జిల్లా సంగెంలో 18.7, చెన్నారావు పేటలో 16.6, నడికూడలో 16.0, హన్మకొండ జిల్లా హాసన్‌పర్తి మండలం చింతగట్టులో 12.5, మహాబూబ్‌బాద్ జిల్లా బయ్యరంలో 12.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.