హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయానికి మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వరద బాధితులు భారీ ఎత్తున కార్యాలయానికి చేరుకుంటున్నారు.
రేవంత్రెడ్డి రాక సందర్భంగా భారీ మోహరించిన బలగాలు - పోలీసుల మోహరింపు
హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయానికి ఎంపీ రేవంత్రెడ్డి వస్తున్న క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలను వెనక్కి పంపించేస్తున్నారు.
heavy sequrity at kukatpally zonal office
ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం వద్ద ఎక్కువ మంది ఉండకుడా... అక్కడి నుంచి పంపించేస్తున్నారు.