తెలంగాణ

telangana

ETV Bharat / city

వాగులో చిక్కుకున్న పిల్లలు.. ఆ తర్వాత ఏమైందంటే..! - heavy rains in vishaka

ఏపీలోని విశాఖ మన్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జీ.మాడుగుల మండలం కిల్లంకోట సమీపంలో కొండవాగు దాటే క్రమంలో చిన్నారులు కొట్టుకుపోయారు. అయితే కొంత దూరం వెళ్లి అనంతరం ఒడ్డుకు చేరుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వాగులో చిక్కుకున్న పిల్లలు..ఆ తర్వాత ఏమైందంటే..!
వాగులో చిక్కుకున్న పిల్లలు..ఆ తర్వాత ఏమైందంటే..!

By

Published : Aug 19, 2020, 7:57 PM IST

వాగులో చిక్కుకున్న పిల్లలు..ఆ తర్వాత ఏమైందంటే..!

విశాఖ మన్యంలో భారీ వర్ష ప్రభావం తగ్గినప్పటికీ.... చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. కొండవాగు గడ్డలు పొంగిపొర్లుతున్నాయి. జీ. మాడుగుల మండలం కిల్లంకోట సమీపంలో కొండవాగు దాటే క్రమంలో కొంత మంది పిల్లలు చిక్కుకున్నారు. వాగు ఉద్ధృతికి తెప్ప పట్టుకుని దాటే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా కొట్టుకుపోయారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే కొంత దూరం వెళ్లి అనంతరం ఒడ్డుకు చేరుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details