తెలంగాణ

telangana

ETV Bharat / city

WEATHER REPORT: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు!

కుండపోతగా కురిసి కుదిపేసి కాస్త విరామం తీసుకున్న వానాలు.. మళ్లీ వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశమున్నా... రేపు, ఎల్లుండి మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు రానున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతోంది.

heavy-rains-in-telangana-from-tomorrow
heavy-rains-in-telangana-from-tomorrow

By

Published : Sep 12, 2021, 2:02 PM IST

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని... తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న అల్పపీడనం.. కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ఒడిశా- బంగాల్ తీరం వద్ద వాయుగుండంగా మారే అవకాశమందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details