రాగల నాలుగైదు గంటల్లో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.
Weather: రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడ పిడుగులు..భారీ వర్షాలు
ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
disaster management
గురువారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది.