రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అక్కడక్కడా తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
బంగాళాఖాతంలోని ఆగ్నేయ, నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. గురువారం తొమ్మిది జిల్లాల పరిధిలోని పలుప్రాంతాల్లో వానలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో 5.4, పటాన్చెరు మండలం పాశమైలారంలో 5.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.
ఇదీ చూడండి :ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం.. ప్రభుత్వం చెప్పినా ఫీ'జులుం'