హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బేగంపేట్, హిమాయత్ నగర్, నారాయణ గూడలో కురిసిన వర్షానికి... రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి, జేబీఎస్, మారేడ్ పల్లి ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. మేడ్చల్‌లో రెండు గంటలపాటు ఎడతెరపి లేకుండా వానలు పడగా.. రోడ్లపై నీరు నిలిచింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లు జలమయం - rain news in hyderabad
ఉపరితల ఆవర్తనం కారణంగా రాజధానిలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదుర గాలుల దాటికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరగా.. వాహనదారుల ఇబ్బంది పడ్డారు.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
రానున్న 24 గంటల్లో దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇవీ చూడండి:'మళ్లీ కరోనా పరీక్షలు.. లాక్డౌన్పై మంత్రివర్గంలో నిర్ణయం'