ఇటు బంగాళాఖాతంలో, అటు అరేబియా సముద్రంలో వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఇవి తీవ్రమై చెరో దిక్కుకు పయనిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో దానికి ‘గతి’ అనే పేరు పెట్టారు. ఇది సోమాలియా తీరం వైపు వెళుతోంది.
బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా, మంగళవారం నాటికి తుపానుగా మారి తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్య ఈ నెల 25న తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.