తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

కర్ణాటకపై 3.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. వీటిప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ తెలిపింది.

heavy-rain-fall-in-hyderabada
భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Jul 15, 2020, 2:17 PM IST

Updated : Jul 15, 2020, 4:16 PM IST

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు రహదారులపై వర్షపు నీరు ప్రవహించగా.. ప్రజలు, వాహనచోదకులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. భాగ్యనగరంలోని ఎంజె మార్కెట్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది.

కూకట్​పల్లి, సరూర్​నగర్​, సైదాబాద్​, చంపాపేట్​, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఫలక్​నూమా, ఉప్పుగూడ, రాజేంద్రనగర్, గండిపేట్, అత్తాపూర్, కిస్మత్‌పూర్‌, బండ్ల గూడ, కార్వాన్​లో భారీ వర్షం నమోదైంది. బోయిన్​పల్లి, బండ్లగూడ, అల్వాల్​, తిరుమలగిరి, ప్యాట్నీ, బేగంపేట్​, చిలకలగూడ, మలక్ పేట, దిల్​సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోలు, ఎల్​బీ నగర్‌, వనస్థలిపురం, తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.

బుధ, గురువారాల్లో రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. కర్ణాటకపై 3.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటిప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తున్నాయని చెప్పారు.

Last Updated : Jul 15, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details