పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - HIGH
15:02 January 24
పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు తెలిపారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్ధమన్నారు. హెచ్ఆర్ఏ విభజన చట్ట ప్రకారం జరగలేదని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.
ఈ క్రమంలో కోర్టు ఎదుట హాజరుకావాలని పిటిషనర్‌తో పాటు 12 సంఘాల నేతలను ధర్మాసనం ఆదేశించింది. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య పీఆర్సీని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
TAGGED:
HIGH