లాలాపేటలోని అర్బన్ కమ్యునిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. బస్తీ దవాఖానాలకు వెళ్లే రోగుల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో అన్నిరకాల పరీక్షలను ఉచితంగా చేస్తామన్నారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియాలజీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే మరో 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లడించారు. ఫలితాలను ఆన్లైన్లో అందించే సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. వివరాలు నేరుగా లబ్దిదారుల ఫోన్ నెంబర్లకే పంపిస్తామన్నారు.