హైదరాబాద్ ఎల్బీనగర్లోని షైన్ పిల్లల ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్‌సింగ్ పరిశీలించారు. ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం వేసిన కమిటీలో తాను, రంగారెడ్డి డీఎంహెచ్ఓ ఉన్నారని రవీంద్ర నాయక్ తెలిపారు. నిన్న ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ప్రాథమిక రిపోర్టు అందజేశామని తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు, ఆస్పత్రి నింబధనల ప్రకారమే నిర్మించారా.. లేదా అన్న అంశంపై ఇవాళ పరిశీలించనునట్లు ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. పోలీసులు త్వరగా స్పందించారు కాబట్టే చిన్నారుల ప్రాణాలు దక్కాయని డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంపై 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
షైన్ ఆసుపత్రిని పరిశీలించిన ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్
హైదరాబాద్‌లోని షైన్ ఆసుపత్రి ఘటనపై విచారణ చేపట్టేందుకు ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్‌సింగ్ ఆసుపత్రిని పరిశీలించారు.
షైన్ ఆసుపత్రిని పరిశీలించిన ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్