నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, ఇళ్లు జలమయమైంది. హాయత్నగర్ సబ్ స్టేషన్ నీటిలో జలదిగ్భందమైంది. ఎగువన ఉన్న సాహెబ్ నగర్ చెరువు కట్టతెగడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. వరదకు తోడు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానతో సబ్ స్టేషన్ మునిగిపోయింది.
జల దిగ్భందమైన హయత్నగర్ సబ్ స్టేషన్ - హయత్నగర్ సబ్స్టేషన్లోకి భారీగా నీరు
భారీ వర్షానికి హయత్నగర్ విద్యుత్ ఉపకేంద్రం నీట మునిగింది. సబ్స్టేషన్ పరిధిలోని కాలనీల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ట్రాన్స్కో సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
జల దిగ్భందమైన హయత్నగర్ సబ్ స్టేషన్
దీంతో సబ్ స్టేషన్ పరిధిలోని కాలనీల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జోరు వానకు తోడు కరెంట్ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వెంటనే విద్యుత్ పునరుద్ధరించేందుకు ట్రాన్స్కో సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే వరద తీవ్రత తగ్గకపోవడం, వర్షం ఆగనందున ఉదయం వరకు కరెంట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... స్తంభించిన జనజీవనం