తెలంగాణ

telangana

ETV Bharat / city

హస్తినపురం కార్పొరేటర్ కేసు త్వరగా తేల్చండి: హైకోర్టు - హైకోర్టులో హస్తినాపురం కార్పొరేటర్​ అనర్హత కేసు

ఇద్దరికి మించి పిల్లలు ఉన్న హస్తినాపురం కార్పొరేటర్​ సుజాత ఎన్నికను రద్దు చేయాలని తెరాస అభ్యర్థి పద్మనాయక్​ హైకోర్టును ఆశ్రయించారు. సిటి సివిల్ కోర్టులో పెండింగ్​లో ఉన్నందున... జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

hasthinapuram corporater disqualify case trial in high court
హస్తినపురం కార్పొరేటర్ కేసు త్వరగా తేల్చండి: హైకోర్టు

By

Published : Feb 11, 2021, 10:38 PM IST

హస్తినాపురం కార్పొరేటర్​గా గెలిచిన భాజపా అభ్యర్థి బాణోతు సుజాతకు ముగ్గురు పిల్లలు ఉన్నారన్న వ్యాజ్యాన్ని మూడు నెలల్లో తేల్చాలని సిటీ సివిల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదన్న నిబంధనను ఉల్లంఘించినందున సుజాత ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల ట్రిబ్యునల్ హోదా ఉన్న సిటీ సివిల్ కోర్టులో తెరాస అభ్యర్థిగా పద్మనాయక్ పిటిషన్ దాఖలు చేశారు.

సిటీ సివిల్ కోర్టులో వ్యాజ్యం పెండింగ్​లో ఉన్నందున... అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. అయితే సుజాతపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని... ఆరోపణలు నిజమని తేలితే ఎన్నికల్లో పోటీకి అనర్హత పడే అవకాశం ఉన్నందున పిటిషన్​ను త్వరగా తేల్చాలని సిటీ సివిల్ కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు విచారణ ముగించింది.

ఇదీ చూడండి:అగ్రిగోల్డ్​ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్​ నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details