ప్రపంచంలో ఎత్తైన మౌంట్ గంగోత్రి, భగీరథ్ పర్వతాలను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు దివ్యాంగులు అధిరోహించారు. సాధించాలనే పట్టుదల ఉంటే చాలు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన 17 ఏళ్ల ఆర్యవర్ధన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అర్షద్ షేక్ రోడ్డు ప్రమాదంలో తమ ఎడమ కాళ్లు కోల్పోయారు. అయినా ధైర్యం కోల్పోలేదు. పర్వాతారోహణపై ఆసక్తితో ఆదిత్య మెహతా ఫౌండేషన్ ద్వారా పర్వతాలు అధిరోహించడంలో శిక్షణ పొందారు. అర్షద్ జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నాడు.
అడుగడుగునా అవాంతరాలే...
కృత్రిమ అవయవాలు అమర్చుకున్న వీరిద్దరూ జులై 17న గంగోత్రి, మౌంట్ భగీరథ్ శిఖరారోహణకు బయలుదేరారు. ఆగస్టు 29న 18వేల అడుగుల ఎత్తున్న శిఖరాల పై భాగానికి చేరుకున్నారు. అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగారు. అనుకున్నది సాధించారు.