తెలంగాణ

telangana

ETV Bharat / city

'సూర్యాపేట జిల్లాలో ఇవాళనుంచే ఎన్నికల నియమావళి' - NOTIFICATION

సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు సీఈవో రజత్‌ కుమార్‌ షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని... ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదని కలెక్టర్​ను ఆదేశించారు.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు మోగిన నగారా..!

By

Published : Sep 21, 2019, 5:21 PM IST

Updated : Sep 21, 2019, 7:16 PM IST

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సూర్యాపేట జిల్లాలో ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు సీఈవో రజత్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన ప్రకటనలు చేయరాదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని సూచించారు. 2019 జనవరి 1 ఓటర్ల జాబితా ప్రకారమే ఉపఎన్నికలు నిర్వహిస్తామని సీఈఓ తెలిపారు. నియమావళి ముగిసేవరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదని కలెక్టర్​ను ఆదేశించారు. హుజూర్‌నగర్‌ ఏపీ సరిహద్దులో ఉన్నందున మరింత నిఘా పెడతామని... మద్యం, డబ్బు సరఫరా అరికడతామన్నారు.

'సూర్యాపేట జిల్లాలో ఇవాళనుంచే ఎన్నికల నియమావళి'
Last Updated : Sep 21, 2019, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details