ఏపీ విశాఖకు చెందిన తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్‌లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొడుతున్నారు. సమాచారం తెలుసుకుని శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు.
విశాఖలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత - తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత
విశాఖ తెదేపా నేత పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. పాత గాజువాక సెంటర్ వద్ద అనుమతులు లేకుండా పల్లా శ్రీనివాసరావు భవనాన్ని నిర్మిస్తున్నారంటూ జీవీఎంసీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పల్లా శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.
విశాఖలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత
అయితే తాము నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకుని స్థానిక తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.