Employees transfers and postings: కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగులు
14:11 December 24
Employees transfers and postings: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
Employees transfers and postings: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగులపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు చేపట్టనున్నారు. కొత్త స్థానికత ఆధారంగానే సీనియారిటీ జాబితా కూడా తయారు చేశారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు ప్రభుత్వం తీసుకోనుంది.
ఉద్యోగుల బదిలీల కోసం కలెక్టర్, జిల్లా శాఖాధిపతితో కమిటీ ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగుల తర్వాత విధుల్లో చేరేందుకు 3 రోజుల గడువు ఉంటుంది. జిల్లా స్థాయి పోస్టులకు కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విడిగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వనుంది.
ఇదీ చూడండి: