ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్చల్ చేశాయి. దాదాపు 20కి పైగా ఉన్న ఏనుగుల గుంపు పలమనేరు అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చాయి. ఏనుగుల గుంపు సంచరిస్తుందన్న సమాచారంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలోని రాధా బంగ్లా, బొమ్మ దొడ్డి చెరువు ప్రాంతాల్లో ఏనుగులు నివాసాల మధ్యలోకి వచ్చేశాయి. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది బాణసంచా పేల్చి ఏనుగులను అడవిలోకి తరిమారు. నివాసాలకు సమీపానికి ఏనుగులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ELEPHANTS: పలమనేరులో ఏనుగుల గుంపు హల్చల్
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు సంచరించాయి. 20పైగా ఉన్న ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లో వచ్చాయి. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది బాణసంచా పేల్చి ఆ ఏనుగులను అడవిలోకి తరిమారు.
ELEPHANTS: పలమనేరులో ఏనుగుల గుంపు హల్చల్