రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల భూగర్భజలమట్టం కూడా పెరిగింది. గత నెలతో పోలిస్తే 1.49 మీటర్ల మేర భూగర్భజలమట్టం పెరిగింది. జూలై నెలలో రాష్ట్రంలో భూగర్భజలాల సగటు 9.26 మీటర్లుగా నమోదైంది. గత ఏడాది జూలైతో పోలిస్తే 4.86 మీటర్ల పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో జూలై వరకు సాధారణం కంటే 18శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్క నిజామాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ భూగర్భజలాలు పెరిగాయి.
అధిక వర్షపాతం వల్ల రాష్ట్రంలో పెరిగిన భూగర్భజలమట్టం - రాష్ట్రంలో పెరిగిన భూగర్భజలమట్టం
రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల భూగర్భజలమట్టం పెరిగింది. ఒక్క నిజామాబాద్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో భూగర్భజలాలు పెరిగాయి.
అధికవర్షపాతం వల్ల రాష్ట్రంలో పెరిగిన భూగర్భజలమట్టం
సంగారెడ్డి జిల్లాలో అత్యంత లోతులో 20.77 మీటర్ల వద్ద భూగర్భజలాలు ఉండగా... ఖమ్మం జిల్లాల్లో అత్యంత తక్కువ లోతున కేవలం 4.13 మీటర్ల వద్దే భూగర్భజలాలు ఉన్నాయి. గత పదేళ్ల సగటు చూస్తే రాష్ట్రంలోని 589 మండలాలకు గాను 477 మండలాల్లో భూగర్భజలాల పెరుగుదల, 112 మండలాల్లో తగ్గుదల నమోదైంది.
ఇవీ చూడండి: పెరుగుతోన్న రిజిస్ట్రేషన్‌లు.. సర్కారుకు భారీగా ఆదాయం