స్నేహమంటే ఇదేరా అన్నట్లుగా.. చనిపోయిన తమ మిత్రుల జ్ఞాపకార్థం దోస్తులంతా ఒక్కటై పేదలకు అండగా నిలిచారు. సికింద్రాబాద్ పరిధిలో పాత బోయిన్పల్లి రాంరెడ్డి కాలనీలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేదలకు తమ వంతు సాయం చేస్తున్నారు. పస్తులుండే పరిస్థితి ఎవరికి రాకూడదని.. కూలీలకు, బీద ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
దోస్తుల జ్ఞాపకార్థం నిత్యావసరాల పంపిణి - నిత్యావసరాల పంపిణి
పేదలకు అండగా నిలిచేందు దోస్తులంతా ఒక్కటయ్యారు. చనిపోయిన మిత్రుల జ్ఞాపకార్థం వారి పేరు మీద బీద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
దోస్తుల జ్ఞాపకార్థం నిత్యావసరాల పంపిణి
అజయ్ సింగ్, కార్తీక్, సిద్ధార్థ ,బాబు జ్ఞాపకార్థం పేదలకు సాయం చేస్తున్నట్లు యువత తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అందే సుధాకర్, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్, ప్రేమ్ సాగర్, జావిద్, అజిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'ఆక్వారైతుకి ఆర్థిక ప్యాకేజీతోనే బాసట'